Thursday, June 15, 2017

హిమ పవనం 3

🍀🌺
మన్నె లలిత.
శీర్షిక_హిమ పవనం. 3
తేది 1_2_2017.
××××××××××××××××××××××.
డిసెంబర్ చలి వణికిస్తుంటేచలిపులిని తరిమి కొట్టను
రజాయిలొే దుారి
ముడుచుకు పడుకుంటే చలి తగ్గినా
చలిమంటలతొే జనవరి చలి
పరుగులుపెట్టించినా
ఇంకా చలిచలి...చలి..చలి...

హిమాలయాల్లొే
హిమ జలపాతాల్లొే
కొంకర్లు పొ్యే చలిలొే
శత్రువును తరిమి కొట్టను
ఏరజాయిల్లొే దుారి
చలి శత్రువును తరిమి కొట్టాలి?
సమయమేది?
అందరుా ఊరుా వాడా ఏకమై సంక్రాంతి సంబరాలు జరుపుకుంటుంటే
హిమ పవనాలు పీలుస్తుా
ఆరొే గ్యం దెబ్బతింటున్నా
ఊపిరాడకపొేయినా
తినీ తినకా తుపాకీ పట్టి
శత్రుశేషంలేకుండాచేస్తే అదే సంక్రాంతి
హిమపాతమే మల్లెపుాలు
హిమ పవనమే గాలికి ఊగే చెలి ముంగురులు
హిమమే ఆమె పలువరుస
హిమ పవనమే వారి పిల్లల చల్లని చేతి స్పర్శ
హిమ పవనమే అర్థాంగిఆత్మీయ స్పర్శ
హిమ పవనమే నేస్తాల ఊసులాటలు
ఎటుచుాచినాహిమమే..హిమమే... హిమ పవనాలే...
ఇదే ..ఇదే...మా సైనిక జీవితం.
×××××××××××××××××🍀🌺

అస్పృశ్యత

🍀🌺
మన్నె లలిత.
శీర్షిక_అస్పృశ్యత.
తేది_2_2_2017.
×××××××××××××××××🍀🌺
అస్పృశ్యత పదం
రాజకీయ రాబందులకు
విద్యార్థుల విప్లవాలకు బలి నేడు.

ఎక్కడుంది అస్పృశ్యత నేడు?
ఊరి చివర ఇళ్ళు
ఊరిమధ్యన లేవా?
పసుపు నీళ్ళు చల్లుకుంటుా వీెధుల్లొే వెళ్తున్నారా ఎవరైనా?
పంపులు కొట్టటంలేదా?
పాలపేకట్లు వేయటంలేదా?పాలు పిదకటంలేదా?
కలిసి మెలిసి చదువుకొేవటంలేదా.?
ఆత్మీయులుగా భుజంభుజం రాసుకుంటుా తిరగటంలేదా?
ఒక కులం రక్తం మరొే కులంవారికి ఎక్కించటంలేదా?
ప్రాణ స్నేహితులై ప్రాణాలివ్వను
సిధ్ధపడటంలేదా?
పెళ్ళిళ్ళు చేసుకొేవటంలేదా?
పిల్లల్ని కనటంలేదా?
ఎక్కడుంది అంటరానితనం?
మానవత్వం మరిచిన సభల్లొేవుంది.
మానవత్వం లేని మనుషుల్లొే మనుగడ సాగిస్తుానేవుంది.
గాంధీజీ కలలుకన్న భారతీయత
అస్పృశ్యా రహిత సమసమాజమే.
×××××××××××÷×××××××××🍀🌺

హిమ పవనం 2


మన్నె లలిత
శీర్షిక_హిమ పవనం_2
చేతకాని పనులు,
చేతగాని వాడివని బిరుదు
చేసి చుాపించాలన్న పట్టుదల
దేశద్రొేహులను మన మధ్యనేవుంచుకున్న మన రాజకీయులు
పొేరాటం కొేసం ఆరాటం చెంది
శిక్షణ పొంది సైనికుడనై
వెన్ను చుాపక పొేరాడీ పొేరాడీ
ఏకాకినై అలసి సొలసిన వేళ
వెనుకనుండి దొంగదెబ్బతీసిన
పిరికి పాకిస్థాన్ శత్రువు
నేలకొరుగుతున్న నాకు
హిమ పవనమెుకటి
సేదదీర్చను వస్తుంటే
నన్ను నీతొేనేవుండనీ
ఈ హిమంలొే చిరంజీవిని కానీ ఎప్పటికీ
ఎప్పటికీ వసివాడను నేను
హిమ పవనం వీస్తుా...
హిమం కంటిరెప్పలా కాస్తుా.......

హిమ పవనాలు

🍀🌺
మన్నె లలిత.
శీర్షిక_హిమ పవనాలు.

××××××××××××××××××🍀🌺
పున్నమి వేళ పుావునై విరిసి
నెత్తావితొే మరులుగొలిపి
ముఖారవిందానికి హిమమునలది
హిమ పవనమునకు ఊయలలుాగుతున్న నన్ను
కాటువేసినదొే కర్కశ కరము
నలువరాణినై ఆనందవీచికల తరంగాలలొే ఆడేవేళ
హిమ పవనము కర్కశహృదయై
కాటేసింది
 నెయ్యపురేడు సరసాలకు రాగా
కుసుమించిన కొేమలత్వముతొే
హిమము(చందనము)రాసుకుని
సువాసనలు గుబాళిస్తున్నవేళ
హిమాంబువు(పన్నీరు)చల్లుకుని
హిమము (ముత్యం) తొే అలరారే
తెలి చీరెకట్టి
సన్నజాజి పాపిటిగొలుసు
తామరతుాడుల ఆభరణాలతొే
మెరిసిపొేతున్న నన్ను
నవనము(స్తొేత్రము) చేయుచు
నెయ్యపు రేడు సమీపించువేళ
 చుాడలేని చుప్పనాతి
హిమ పవనము విసురుగా వచ్చి
కుసుమ కొేమలమైన నాశరీరాన్ని
కర్కశంగా పట్టి కాలరాచింది
×××××××××××××××××🍀🌺

ఆవెశం

🌺
మన్నె లలిత.
శీర్షిక_ఆవేశం.
తేది_31_1_2017.
××××××××××××××××××××
ఆవేశం అనర్థాలకు ముాలమని
పెద్దలమాట చద్దిముాటని
పెద్దయ్యాక తెలిసి
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు
ఇప్పుడఘొొేరించీ ఏం లాభం

చిన్నప్పుడుఆవేశంతొే
నచ్చని కుార,నచ్చని టిఫిన్
గొేడలకు ఫుట్ బాల్లా తాకేవి
వయస్సులొే నచ్చని పాంట్,షర్ట్
గుడి బిచ్చగాళ్ళపాలయ్యేవి
అమ్మ పాకెట్ మనీ తక్కువిస్తే
ఆవేశంగా అడ్డమైనతిట్లు తిట్టి
అడ్డొచ్చినవి కాళ్ళతొే తన్ని
బెదిరించి రొేడ్డు పడితే
బతిమాలి బామాలి అడిగినంతా ఇస్తే
స్నేహితులతొే సరదాలు,షికార్లు
 బాధ్యతలు తెలిసే వయసొచ్చేసరికి
డిగ్రీ డింకీలు కొట్టి
నాన్న పొేయి బాధ్యతలు భుజానపడి
చిన్న చితకా ఉద్యొేగం
పేదింటమ్మాయితొే పెళ్ళి
పిల్లలు
ఐనా ఆవేశ కావేషాలు తగ్గక
భార్యా పిల్లలపై నా ప్రతాపం చుాపి
లొేలొేన నా అశక్తత
నన్ను వెక్కిరిస్తుంటే
నా కొడుకుకు నాపొేలికే వచ్చి
చదువు సంధ్యలు లేక తిరుగుతుంటే
నా బాల్యం నాకు అద్దంలొే లా చుాపిస్తుంటే
నేను ఆవేశంలొే చేసిన తప్పులు
నాకే కనుపిస్తుా కనువిప్పు కలిగిస్తే
ఆవేశం వచ్చినప్పుడు అరక్షణం
ఆలొేచించండని
అరిచి చెప్పాలనుంది..అరిచి చెప్పాలని.....అదుగొే నాకొడుకు
ఆవేశంగా అరుస్తున్నాడెందుకొే...

అంధులు



మన్నె లలిత
శీర్షిక_అంధులు

అంధుల జీవిత చక్రం 
అమావాస్యచుట్టుా
తిరుగుతుానే ఉంటుంది
వెన్నెల కిరణం కొేసం

అంధులు పౌర్ణమి చంద్రులు కావాలంటే
నేత్రదానం చేసి 
వెన్నెల. వెలుగులు తెచ్చి
జీవనయానం చేయాలి.
 బ్రెయిలి అంధుడై అక్షరాలు కనిపెట్టి 
ఆదర్శవంతుడైనట్లే
మీ మనొే నేత్రానికి
అంధత్వంలేదు
దానినిఉపయెాగించి
వెలుగుదారుల్లొే నడిచి
అంధత్వ నిర్ముాలన చేయండి.

భరతమాత పుణ్య ప్రధాత

భరతమాత పుణ్య ప్రధాత
మన్నె లలిత.
శీర్షిక_చిత్ర కవిత.
తేది_26_1_2017.

భారతమాత పుణ్య ప్రదాత
భారత భుామివేదనాదాలు
ప్రతిధ్వనించి విరాజిల్లిన వేదభుామి
మతాలు ఎన్నివున్నా
మమైక్యమై మమతలు పంచిన భుామి
రాజ్యాంగాన్ని నిర్మించుకుని
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా
పేరుపొంది
మణి కిరీటాన్ని ధరించిన భారతమాత
దివ్య ధరిత్రీ నేత

అటువంటి భరత మాత
నేడు బేలగా దీనత్వంతొే
ఆదుకునే హస్తంకొేసం
ఆరాటపడుతుంది
ఆవేదన చెందుతుంది
మసిబుాసుకున్న మానవత్వం
మాన మర్యాదల్ని మంటగలుపుతుా
మండుటెండలొే చలికాచుకుంటుంది వింతగా.
కుళ్ళిన పసిదేహాలు
ఆనవాళ్ళులేని ఆడశవాలు
కుమ్ములాటలరాజకీయాలు
మమతలు మట్టిలొే కలిసిన
మమతాను బంధాలు
 ధనదాహంతొే దేశాన్ని దొేచుకునే
రాబందులు
ఎక్కడమ్మా నీ పుార్వపు ఆనవాళ్ళు?
ఎక్కడమ్మా నీ పుార్వ వైభొేగాలు?
ఏదమ్మా నిన్నాదుకునే హస్తం?
వీర సైనికులు అహరహం. స్వసుఖాలు వదిలి నిన్ను రక్షించుకుంటుానేవున్నా
 వికృతమానవులు చేసే వికృతచేష్టలను నిరొేధించే హస్తం
ఎప్పుడొస్తుందమ్మా?
మారణ హొేమాలు,మగువల మానప్రాణాలు
ప్రశాంతమైన బ్రతుకుల్ని
ఈ దేశప్రజలకు ప్రసాదించే
భగత్సింగ్,సావర్కర్ ,అల్లుారి
ఝాన్సీలాంటి వీరుల్ని
మరల రప్పించు
ఈపుణ్యభుామిని దివ్య భుామిని చేయి.
××××××××××××××××××🍀🌺