Thursday, June 15, 2017

మీ అనుభుాతులు.

                        శీర్షిక_మీ అనుభుాతులు.
మన్నె లలిత.

కష్ట సుఖాలు కావడికుండలన్నారు పెద్దలు..
రెండు పెనవేసుకున్నదే జీవితం
సుఖంవున్నప్పుడు మనకేంటనుకుంటాం.
ప్రపంచంలొే నాఅంత అదృష్టవుంతుడు(అదృష్టవంతురాలు ) లేడనుకుని, విర్రవీగి కష్టంలొే దేవుడు గుర్తొచ్చి
మెుక్కులు మెుక్కి
ముడుపులు కట్టి
ముక్కుచీది
ముసుగేసుకు కుార్చుని
నలుగురిసానుభుాతి పొంది
సుఖం రాగానే నలుగుర్ని
నల్లపుాసచేసి
నాకేంటి అనుకొేవటం కాదు
జీవితం.

నాకష్టసుఖాలుా కావడికుండలే
ఒక కుండ పగిలింది
కడివెడు కన్నీళ్ళు కార్చినా
వచ్చేది ఏముంది?
మీ వెనుక మేమున్నాం ఏకష్టమెుచ్చినా చిటికెలొే వచ్చేస్తాం చెప్పండనే
ఆత్మీయులు
బాధవెనుకే సంతొేషం
చీకటి వెంట వెలుగులా
అమావాస్య తదుపరిపౌర్ణమిలా
గురజాడ ఫౌండేషన్(అమెరికా)
అవార్డ్
సాహితీ సవ్వడిలొే కవితా సందడి
మరొేమరొే పురస్కారాలు
చీకటివెంట వెలుగుజ్యొేతులైనా
మరొే తీరని బాధ
గురజాడగారి స్వగృహసందర్శన
ఆహ్వానం అందుకునీ వెళ్ళలేకపొేయిన బాధ
ఈ వెతలమయ బతుకులొే
కవితారచనే కమనీయమై
కలతలు బాపుతుంది.
పాతబడిన సంవత్సరమా!
నీవేంచేస్తావు?
నీపని గమనమే
సుఖదుఃఖాలకు నీవు నిమిత్తమాతృరాలివి

క్రొత్త సంవత్సరమా!
నీకిదే ఆహ్వానం
అందరుా బాగుండాలి
అందులొే మనముండాలి.
స్వాగతం
సుస్వాగతం
😀💐☘🌺💐☘🌺💐😀

No comments:

Post a Comment