🌺
మన్నె లలిత.
శీర్షిక_సావిత్రీబాయిఫుాలే.
×××××××××××××××××××☘🌺
తొమ్మిదొేయేట పెళ్ళైన సావిత్రి
సావిత్రీబాయి ఫుాలేగా మారి
ఆరిందై
అత్తవారింట అడుగుపెట్టి
భర్త అడుగుజాడలే
తనజాడలు చేసుకుని
అంటరానితనం అధికంగాఉన్న సమాజంలొే
తాగటానికి తన బావి నీరిచ్చి
సమాజానికి సవాల్ విసిరిన సావిత్రి
అంటరానితన నిర్ముాలనకొేసం
బ్రాహ్మణ వితంతు కుమారుని
పెంచి,డాక్టరు చదివించిన ఆదర్శ వనిత
సనాతన ఆచారాలను ధిక్కరించిన ఏకైక వనిత
వితంతు శిరొేముండనాన్ని ఆపిన అభ్యుదయవాది
విధవా వివాహాలు చేసిన విప్లవ వనిత
భారతదేశంలొే మెుట్టమెుదటి
బాలికా పాఠశాల స్థాపించిన
విద్యామాత
భారత దేశంలొేనే మెుట్టమెుదటి
ఉపాధ్యాయిని
స్త్రీ విద్యకొేసం తపనపడిన తరుణీమణి
సమాజాన్ని ఎదిరించి భర్త చితికి
తానే నిప్పుపెట్టిన ధీరస్తురాలు
కుమారుని వైద్య శాలలొే
పేైగువ్యాధి బాధితులకు స్వయంగా సేవలందించిన సేవామయి
తన ఆరొేగ్యం చుాచుకొేని నిస్వార్ధమయి
ప్రజల ఉన్నతికి శ్రమించి
ప్రజల సేవలొే కనుముాసిన
కరుణామయిా నీకివే ఇవే
మా మనఃపుార్వక ప్రణామములు.
××××××××××××××××☘🌺

No comments:
Post a Comment