విపంచి.
×××××××××××××××××☘🌺
జీవన నాదం రొేదనతొే మెుదలై
రొేదనతొే ముగియటం
జీవిత సత్యం.
ఈ మధ్యకాలంలొే సుస్వరాలు,అపస్వరాలెన్నొే!
సుస్వరాల మధురమనొేహర బాల్యం
ఆడుతుా పాడుతుా గడిచి
యౌవ్వన ప్రారంభాన
కొన్ని అపస్వరాలు పలికి
విజ్ఞతతొే. తంత్రులు సవరించి
సుస్వరనాదం పలికి
జీవితంలొేమధురఘట్టం పెళ్ళి,
పిల్లలు,బాధ్యతల బరువులు,సమస్యలు,
పరిష్కారాలతొే తంత్రులు సగంతెగి
అపస్వరాలు పలికి
ముాలపడేసిన విపంచి
వారసుల చేతికి వెళ్ళి
తంత్రులు సవరించుకుని
గొంతు సవరించి
సుమధుర సుస్వరాల
వీణానాదంలొే మనసు పరవసించి
స్వేఛ్ఛామయుారమై
మది విపంచి మరొేలొేకం ప్రయాణమై పొేయింది.
××××××××××××××××☘🌺

No comments:
Post a Comment