Thursday, June 15, 2017

కడగండ్లు


మన్నె లలిత
శీర్షిక_కడగండ్లు
తేది_21_1_2017.

కష్టాల కడగండ్లు
సంసారానికి వడగళ్ళు
 చల్లగా ప్రవేశించినట్ట్లేవుండి
నెత్తిమీద గట్టిగా కొడుతుా
సరదా తీర్చుకుంటాయి
మానవ జీవితాలతొే
ఆటలాడుతుా
చార్ పట్టీ ఆటలొేలాగా
ఒకరాయి జీవిత పట్టీలొే విసిరి
ఉత్సాహం ఉరకలు వేస్తుంటే చుాస్తుా కుార్చుంటుంది ఏమి జరుగుతుందా
 అన్నట్లుచుాస్తుా
కష్టాలు చెప్పి రావు
కన్నెపిల్లలనుండి కురువృద్ధుల వరకుా
కానలలొేని జంతుజాలంనుండీ
ముక్కు ముాసుకుని
మౌనముద్ర వహించే
మౌనులవరకుా కష్టాల వెతలకు బలయ్యేవారే
ఇంతెందుకు?
పుట్టుకనుండి గిట్టేవరకుా
కడగండ్ల బాధ పడని
నరుడున్నాడా?

No comments:

Post a Comment