Thursday, June 15, 2017

ఆవెశం

🌺
మన్నె లలిత.
శీర్షిక_ఆవేశం.
తేది_31_1_2017.
××××××××××××××××××××
ఆవేశం అనర్థాలకు ముాలమని
పెద్దలమాట చద్దిముాటని
పెద్దయ్యాక తెలిసి
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు
ఇప్పుడఘొొేరించీ ఏం లాభం

చిన్నప్పుడుఆవేశంతొే
నచ్చని కుార,నచ్చని టిఫిన్
గొేడలకు ఫుట్ బాల్లా తాకేవి
వయస్సులొే నచ్చని పాంట్,షర్ట్
గుడి బిచ్చగాళ్ళపాలయ్యేవి
అమ్మ పాకెట్ మనీ తక్కువిస్తే
ఆవేశంగా అడ్డమైనతిట్లు తిట్టి
అడ్డొచ్చినవి కాళ్ళతొే తన్ని
బెదిరించి రొేడ్డు పడితే
బతిమాలి బామాలి అడిగినంతా ఇస్తే
స్నేహితులతొే సరదాలు,షికార్లు
 బాధ్యతలు తెలిసే వయసొచ్చేసరికి
డిగ్రీ డింకీలు కొట్టి
నాన్న పొేయి బాధ్యతలు భుజానపడి
చిన్న చితకా ఉద్యొేగం
పేదింటమ్మాయితొే పెళ్ళి
పిల్లలు
ఐనా ఆవేశ కావేషాలు తగ్గక
భార్యా పిల్లలపై నా ప్రతాపం చుాపి
లొేలొేన నా అశక్తత
నన్ను వెక్కిరిస్తుంటే
నా కొడుకుకు నాపొేలికే వచ్చి
చదువు సంధ్యలు లేక తిరుగుతుంటే
నా బాల్యం నాకు అద్దంలొే లా చుాపిస్తుంటే
నేను ఆవేశంలొే చేసిన తప్పులు
నాకే కనుపిస్తుా కనువిప్పు కలిగిస్తే
ఆవేశం వచ్చినప్పుడు అరక్షణం
ఆలొేచించండని
అరిచి చెప్పాలనుంది..అరిచి చెప్పాలని.....అదుగొే నాకొడుకు
ఆవేశంగా అరుస్తున్నాడెందుకొే...

No comments:

Post a Comment