Thursday, June 15, 2017

కష్టాల కడగండ్లు

మన్నె లలిత
కష్టాల కడగండ్లు

ధర్మ కాలాన ధర్మం నాలుగు పాదాల నడచి
సుఖ సంతొేషాలతొ్ నాలుగు వేళ్ళుా లొేపలకు పొేయాయి
ఉన్న దానిలొే సర్దుకుని
గుట్టుగా
కాలుమీద కాలు వేసుకుని
మీసం మెలివేసుకుని
అంబలి తాగినా ఆనందంగా బ్రతికిన రొేజులు
ఉద్యొేగాలు సద్యొేగాలుా లేకపొేయినా
డబ్బుాదస్కం లేకున్నా
పాడిపంటలతొే పరువుగా బ్రతికిన రొేజులు
గడ్డుకాలమున్నా,కడగండ్లనుకొేక
కన్నీరు రానివ్వక
కష్టాల తీరాలు దాటి
పదిమంది పిల్లలున్నా
పరమానందంగా అదే ఐశ్వర్యమనుకున్న రొేజులు

కొేట్లు,లక్షలున్నా
లక్షణంగా బ్రతుకు బ్రతకలేక
డాలర్ల వేటలొే
డాంబికాలుపొేయి
విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టి
అనారొేగ్యాలతొే ఆసుపత్రులచేరి
కొేరి కడగండ్లు తెచ్చుకుని
బతుకీడుస్తుా
కన్న తల్లిదండ్రులను కాటిలొే కాపురాలు పెట్టిస్తున్న
కనికరంలేని రొేజులు

చదువులొే శ్రద్ధచుాపక
జల్సాలుచేసి
కడగండ్లపాలై కన్నవారిచెంతచేరి
కనువిప్పుపొందిన రొేజులు
రైతులు నాసిరకం విత్తనాలతొే
పంట పొేగొట్టుకుని
కడగండ్లపాలై
సంసారరథాన్ని లాగలేక
బతుకు బండలు చేసుకున్నరొేజులు
చేజేతులా సంసారాలు
చెడగొట్టుకొేకుండా
వర్తమాన పరిస్థితులతొే పొేటీపడుతుా
ధైర్యాన్ని పొేగొట్టుకొేక
సంసారాన్ని సరిగమపదనిసలతొే
లయబద్ధంగా గాడితప్పకుండా
కడగండ్లులేని బ్రతుకు బ్రతకాలి.

No comments:

Post a Comment